News September 25, 2024
మద్యం షాపులు ఖాళీ.. మందుబాబుల ఆవేదన

AP: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ కింద తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి రానున్న వేళ మందుబాబులకు కొత్త చిక్కొచ్చి పడింది. చాలా మద్యంషాపులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. డిపోల నుంచి సరఫరా నిలిపివేయడంతో పాటు ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలుండటంతో షాపులన్నీ ఖాళీ అయ్యాయి. కొన్ని ఖరీదైన బ్రాండ్లే అందుబాటులో ఉండటంతో తమకు ఇబ్బందిగా మారిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 28, 2025
VHTలో ఆడనున్న శ్రేయస్ అయ్యర్!

గాయం కారణంగా టీమ్‌కు దూరమైన వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అతను పూర్తిగా కోలుకున్నట్లు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లోని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ముంబై తరఫున జనవరి 3, 6న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటారని, తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని సమాచారం. OCT 25న AUSతో మ్యాచ్‌లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే.
News December 28, 2025
డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ ఏమన్నారంటే?

హీరోయిన్ నిధి అగర్వాల్ #ASKNIDHI అంటూ ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా ఒకరు ‘ఏ కాస్ట్యూమ్/అవుట్ ఫిట్ ధరించడం మీకు ఇష్టం?’ అని అడిగారు. అందుకు ‘నన్, ఏంజెల్ కాస్ట్యూమ్ ఇష్టం’ అంటూ నిధి చెప్పారు. ఆమె రాజాసాబ్ చిత్రంలో నన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్స్ వస్త్రధారణపై జరుగుతున్న చర్చలో <<18661197>>నిధి<<>> పేరు హైలైట్ కావడంతో ఆమె ఇచ్చిన ఆన్సర్ SMలో వైరలవుతోంది.
News December 28, 2025
వైద్యం అందక భారత సంతతి వ్యక్తి మృతి.. మస్క్ ఆగ్రహం

కెనడాలో సరైన చికిత్స అందక భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్(44) మృతి చెందడంపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన ప్రశాంత్‌ను 8 గంటలపాటు వెయిట్ చేయించారు. దీంతో కెనడా హెల్త్‌కేర్ సిస్టంను US మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్‌తో పోల్చుతూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.


