News September 25, 2024

బెన్ స్టోక్స్ మరోసారి యూటర్న్?

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ బాల్ క్రికెట్‌లో దేశం తరఫున ఆడాలని సెలక్టర్లు, కోచ్ కోరితే తప్పకుండా ఆడతానని ఆయన తెలిపారు. కాగా 2022లో స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత 2023WCలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వీడ్కోలు పలికారు. ఇప్పుడు మరోసారి పునరాగమనం చేయాలని భావిస్తున్నారు.

Similar News

News September 25, 2024

టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇతడే..

image

టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టాప్-5లో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ బ్యాటర్ ఇతడే. జైస్వాల్ టీ20ల్లో 4, టెస్టుల్లో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వన్డేల్లోనూ అవకాశాలు లభిస్తే అందులోనూ తన మార్క్ చూపించే అవకాశాలు ఉన్నాయి.

News September 25, 2024

30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు

image

బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్‌లో టీమ్ లీడర్‌గా ఉన్న రంజన్‌తో రిలేషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.

News September 25, 2024

కనిష్ఠ స్థాయికి ఆర్కిటిక్ సముద్రపు మంచు

image

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆర్కిటిక్ సముద్రపు మంచు Sep నెలలో వార్షిక కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏటా ఉత్తరార్ధగోళంలో మంచు గ‌ణ‌నీయ స్థాయిలో క్షీణిస్తోంది. నాసా, NSIDC డేటా సెంటర్ పరిశోధకుల ప్రకారం ఈ ఏడాది కనిష్ఠ పరిధి 4.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా న‌మోదైంది. సముద్రపు మంచు నష్టం ఏడాదికి 77,800 Sq.KM చొప్పున సంభవిస్తోంది. ఈ క్షీణత విస్తీర్ణంలో మాత్రమే కాకుండా మంచు నాణ్యతలో కూడా ఉంది.