News September 25, 2024

దేవర సినిమాకు చుక్కెదురు

image

ఏపీలో దేవర టీంకు చుక్కెదురైంది. 14 రోజుల పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవధిని 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచారు.

Similar News

News November 12, 2024

గుండె పదిలంగా ఉండాలంటే..!

image

పదికాలాల పాటు మీ గుండె పదిలంగా ఉండాలంటే పొట్ట తగ్గించి నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘పోషక ఆహారాన్ని ఎక్కువగా తినండి. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు తినాలి. కూల్ డ్రింక్స్ వద్దు. వంటల్లో తక్కువ మోతాదులో ఉప్పు వాడండి. పొట్ట నిండా తినడం మానేయండి. ప్రతిరోజూ అరగంట – గంట వ్యాయామం తప్పనిసరి. మద్యం ముట్టకండి. పొగాకు దరిచేరనీయవద్దు. 7-9 గంటలు పడుకోండి. వీలైనంత ప్రకృతితో గడపండి’ అని తెలిపారు.

News November 12, 2024

BIG BREAKING: గ్రూప్-2 వాయిదా

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు APPSC వెబ్‌సైటును చూడాలని సూచించింది.

News November 12, 2024

MLAలు ప్రజలతో మమేకం కావాలి: CM

image

AP: NDA MLAలంతా ప్రజలతో మమేకం కావాలని CM చంద్రబాబు కోరారు. NDA శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2029లో మీ అందరినీ MLAలుగా మళ్లీ గెలిపించుకోవాలనుకుంటున్నా. MLA ఛైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. స్థానిక టూరిజం అభివృద్ధికి MLAలు డాక్యుమెంట్ సిద్ధం చేయాలి. ఉచిత ఇసుక విధానం మీరే సక్రమంగా అమలు చేయాలి. సమస్యలు నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా’ అని వెల్లడించారు.