News September 25, 2024
NZB: ప్రేమ నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య
ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి చెందిన 21 ఏళ్ల యువకుడు ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 10న పురుగుల మందు తగగా NZBలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
Similar News
News December 30, 2024
NZB: ప్రతి పౌరుడు సహకరించాలి: ఇన్‌ఛార్జ్ CP
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. DEC 31న రాత్రి నిర్వహించే వేడుకలపై ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు పెడుతున్నట్లు NZB ఇన్ ఛార్జ్ సీపీ సింధు శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా, అహ్లదకరంగా, ఆరోగ్యంగా హాని రహితంగా ఉండాలని కోరారు. ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.
News December 30, 2024
క్రైమ్ రేటుపై చర్చకు సిద్ధం: మోహన్ రెడ్డి
ఉనికి కోసమే కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత అబద్ధపు మాటలు చేస్తున్నారని రాష్ట్ర సహకార యునియన్ లిమిటెడ్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబాన్ని మించిన వారు రాష్ట్రంలో లేరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వ హయంలో క్రైమ్ రేట్ పెరిగిందో, తగ్గిందో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశామన్నారు.
News December 30, 2024
ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోం: MLC కవిత
ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోబోమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్‌లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమన్నారు. బుల్డోజర్‌తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.