News September 25, 2024

దయచేసి ఆ వీడియో వైరల్ చేయొద్దు: రష్మీ గౌతమ్

image

తాను గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని యాంకర్ రష్మీ గౌతమ్ కోరారు. అది 2020 కంటే ముందు ఇంటర్వ్యూ అని తెలిపారు. ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేసి పాఠకులను తప్పుదోవ పట్టించొద్దని ఆమె ట్వీట్ చేశారు. కాగా జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైన వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Similar News

News September 25, 2024

ఒత్తిడితో గుండెకు ముప్పు: అధ్యయనం

image

వర్క్ ప్రెషర్‌తో ఉద్యోగులు చనిపోతున్న వేళ ట్రూవర్త్ వెల్‌నెస్ అధ్యయనం వైరలవుతోంది. కార్పొరేట్ ఇండియాలో 16% ఉద్యోగులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. 35-50 ఏళ్ల మధ్యలో ఉన్న 31% మందికి హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం, స్మోకింగ్, పెరిగిన ఒత్తిడిని ప్రమాద కారకాలుగా పేర్కొంది. కాగా 20.4% మందిలో ప్రీడయాబెటిక్ షుగర్ లెవెల్స్ గుర్తించారు.

News September 25, 2024

రూ.11కే ఐఫోన్ 13.. ఫ్లిప్‌కార్ట్ ఏమందంటే?

image

ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆఫర్ కింద తక్కువ ధరకే మొబైల్స్ విక్రయిస్తున్నామన్న ఫ్లిప్‌కార్ట్ ప్రకటనపై కస్టమర్లు మండిపడుతున్నారు. రాత్రి 11 గం.కు ఐఫోన్ 13ను రూ.11కే అమ్ముతున్నామంటూ సైట్‌లో పెట్టారని, కానీ ప్రతిసారి సోల్డ్ ఔట్, ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపించిందని ఫైరవుతున్నారు. అయితే ఆఫర్ తొలి ముగ్గురికే అందుతుందని బిగ్ బిలియన్ డేస్‌లో రా.9, 11 గంటలకు మరిన్ని ఆఫర్స్ అందుకోవచ్చని కంపెనీ రిప్లై ఇచ్చింది.

News September 25, 2024

ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

TG: HYD హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు <>https://iti.telangana.gov.in<<>> లో అప్లై చేసుకోవాలని సూచించారు.