News September 25, 2024
BRS ఏం చేసిందో, కాంగ్రెస్ అదే చేస్తోంది: కూనంనేని

సింగరేణి లాభాలకు వాటా సంబంధించి ప్రభుత్వంపై విమర్శ చేసే క్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ బాధ్యత వహించాలని కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు తప్పుపట్టారు. BRS ప్రభుత్వం ఏమి చేసిందో, ఈ ప్రభుత్వం కూడా అదే చేసిందని చెప్పారు. BRS ప్రభుత్వం పాక్షికంగా కార్మికులకు వాటాలను పంచిందని చెప్పారు. రూ.4701 కోట్లు కాగా రూ.2412 కోట్ల నికర లాభాల నుండి 33% ఇచ్చారని అన్నారు.
Similar News
News March 2, 2026
తల్లాడ: ఈ స్టూడెంట్ బ్రిలియంట్

రంగం బంజరకు చెందిన ధర్మసోత్ మోక్షిత్ నాయక్ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్‌లో నాలుగు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి నేషనల్ టాపర్‌గా నిలిచాడు. 50 మార్కులకు గాను 47 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గిరిజన విద్యార్థి సాధించిన ఈ ఘనతపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ మోక్షిత్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
News March 1, 2026
షేర్ మార్కెట్ పేరుతో నిలువు దోపిడీ.. కేటుగాడికి రిమాండ్

ఖమ్మం: ఆన్‌లైన్ ఉద్యోగాలు, షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో అధిక లాభాల ఆశచూపి రూ.47 లక్షలు వసూలు చేసిన కేటుగాడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి రిమాండ్ విధించి జైలుకు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
News March 1, 2026
ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


