News September 25, 2024
జేపీ నడ్డా వ్యాఖ్యలపై స్పందించిన RSS
BJP గతంలో RSS సహకారం తీసుకుందని, అయితే ఇప్పుడు సొంతంగా తన వ్యవహారాలను చూసుకోగలదన్న పార్టీ అధ్యక్షుడు JP నడ్డా వ్యాఖ్యలను ‘కుటుంబ వ్యవహారంగా’ RSS అభివర్ణించింది. ఈ వ్యాఖ్యలతో రెండింటి మధ్య దూరం పెరిగిందన్న వార్తలపై RSS అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పందించారు. ‘ఇది కుటుంబ వ్యవహారం. అలాగే పరిష్కరించుకుంటాం. దీనిపై బహిరంగ వేదికలపై చర్చించం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 21, 2024
సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: అల్లు అర్జున్
TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదని వివరించారు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని వివరించారు. ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవట్లేదని చెప్పారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.
News December 21, 2024
అందుకే పరామర్శించేందుకు వెళ్లలేదు: బన్నీ
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోతే తాను వెళ్లి స్వయంగా పరామర్శించానని అల్లు అర్జున్ తెలిపారు. ఇప్పుడు తన అభిమాని చనిపోతే వెళ్లలేదనడం సరికాదని వ్యాఖ్యానించారు. కానీ తొక్కిసలాట తర్వాత జరిగిన పరిణామాల వల్లే వెళ్లలేకపోయానని, అందుకే నా సానుభూతి తెలియజేస్తూ వీడియో విడుదల చేశానని చెప్పారు. రేవతి మృతిపై ఎలా స్పందించాలనే దానిపై తాను ఇంకా పూర్తిగా క్లారిటీ తీసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు.
News December 21, 2024
నేను రోడ్ షో చేయలేదు: అల్లు అర్జున్
‘పుష్ప2’ ప్రీమియర్‌కు సంధ్య థియేటర్ వద్ద తాను రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ తెలిపారు. తన కోసం ఎదురుచూస్తున్న వేలాది ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చేయి మాత్రమే చూపించానన్నారు. అనంతరం కాసేపు సినిమా చూసి వెళ్లిన తనకు తొక్కిసలాటపై మరుసటి రోజే తెలిసిందన్నారు. రేవతి మృతి గురించి తెలిసి ఆస్పత్రికి బయల్దేరినా, కేసు నమోదవడంతో వెళ్లొద్దని పోలీసులు, సన్నిహితులు చెప్పారని అల్లు అర్జున్ వెల్లడించారు.