News September 25, 2024

టాప్-2కు దూసుకెళ్లిన బుమ్రా

image

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకుకు దూసుకెళ్లారు. జడేజా 7 నుంచి ఆరో స్థానానికి చేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు. అలాగే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ 5, రిషభ్ పంత్ 6, రోహిత్ శర్మ 10, విరాట్ కోహ్లీ 12, శుభ్‌మన్ గిల్ 14వ ప్లేస్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Similar News

News September 25, 2024

సూట్‌లో డిప్యూటీ సీఎం భట్టి

image

TG: విదేశీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాస్ వెగాస్‌లో జరిగిన MINE EXPO 2024లో పాల్గొన్నారు. దీనికి 125 దేశాల నుంచి మొత్తం 44,000 మంది ప్రతినిధులు హాజరయ్యారని, పలు కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఎప్పుడూ పంచెకట్టులో కనిపించే భట్టి సూట్‌లో కొత్తగా కనిపించారు.

News September 25, 2024

నాణ్యత పరీక్షల్లో 53 రకాల మందులు ఫెయిల్

image

కొన్ని సంస్థల పారాసెటమాల్ IP 500 MG, విటమిన్ C, D3 షెల్కాల్, విటమిన్ B కాంప్లెక్స్, C సాఫ్ట్‌జెల్స్ త‌దిత‌ర 53 ర‌కాల మందులు నాణ్య‌త పరీక్షల్లో విఫ‌ల‌మైన‌ట్టు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. కాల్షియం, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు Telmisartan ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మందులను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్ తదితర సంస్థలు తయారు చేసినవి. <>జాబితా<<>> ఇదిగో.

News September 25, 2024

హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రాలో కొత్తగా 169 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యుటేషన్‌పై కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.