News September 25, 2024
MUDA SCAM: హైకోర్టు తర్వాత సిద్దరామయ్యకు షాకిచ్చిన స్పెషల్ కోర్టు
కర్ణాటక CM సిద్దరామయ్యకు మరో షాక్. ఆయన భార్య పార్వతికి ముడా అక్రమంగా 14 సైట్లు కేటాయించిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని లోకాయుక్త పోలీసులను స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌లో దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దూ వేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఆ తర్వాతి రోజే స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ లోకాయుక్తను ఇలా ఆదేశించడం గమనార్హం.
Similar News
News November 12, 2024
నా భర్త సినిమాలు కొన్ని అస్సలు నచ్చవు: మోహన్‌లాల్ భార్య
తన భర్త సినిమాలు అందరికీ నచ్చినా తనకు మాత్రం కొన్ని నచ్చవని మలయాళ స్టార్ మోహన్‌లాల్ భార్య సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన సినిమాలు కొన్నింటిని అస్సలు చూడలేకపోయాను. ఆ విషయాన్ని ఆయనతో కరాఖండీగా చెబుతుంటాను. నా అభిప్రాయాలు ఎలా ఉన్నా సినిమా వెనుక ఉన్న కృషిని మాత్రం గౌరవిస్తాను’ అని పేర్కొన్నారు. మోహన్‌లాల్-సుచిత్ర 1988లో పెళ్లాడగా వారికి ప్రణయ్, విస్మయ అనే ఇద్దరు పిల్లలున్నారు.
News November 12, 2024
2027 లేదా 2028 నాటికి పోలవరం పూర్తి: సీఎం
AP: పోలవరం ప్రాజెక్టును 2027 లేదా 2028 నాటికి పూర్తి చేస్తామని NDA శాసనసభాపక్ష సమావేశంలో CM చంద్రబాబు వెల్లడించారు. ‘ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చింది. దీంతో ఫేజ్-1 ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఫేజ్-2లో R&R, భూసేకరణ సమస్యలు పరిష్కరిస్తాం. ఈ ఏడాది పోలవరం నుంచి అనకాపల్లి, విశాఖకు నీళ్లు తీసుకెళ్తాం. అనంతరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు అనుసంధానం చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 12, 2024
గుండె పదిలంగా ఉండాలంటే..!
పదికాలాల పాటు మీ గుండె పదిలంగా ఉండాలంటే పొట్ట తగ్గించి నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘పోషక ఆహారాన్ని ఎక్కువగా తినండి. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు తినాలి. కూల్ డ్రింక్స్ వద్దు. వంటల్లో తక్కువ మోతాదులో ఉప్పు వాడండి. పొట్ట నిండా తినడం మానేయండి. ప్రతిరోజూ అరగంట – గంట వ్యాయామం తప్పనిసరి. మద్యం ముట్టకండి. పొగాకు దరిచేరనీయవద్దు. 7-9 గంటలు పడుకోండి. వీలైనంత ప్రకృతితో గడపండి’ అని తెలిపారు.