News September 25, 2024

ట్రోల్స్‌పై మనూ భాకర్ కౌంటర్

image

ఎక్కడికెళ్లినా ఒలింపిక్ మెడల్స్ తీసుకెళ్తున్నారని భారత షూటర్ మనూ భాకర్‌పై నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటికి తాజాగా ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘పారిస్ 2024 ఒలింపిక్స్‌లో నేను సాధించిన రెండు కాంస్య పతకాలు భారత్‌కే చెందుతాయి. ఏదైనా ఈవెంట్‌కు నన్ను పిలిచి, ఈ పతకాలను చూపించమని అడిగితే నేను గర్వంగా చూపిస్తుంటాను. నిర్వాహకులు కూడా మెడల్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంటారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 25, 2024

నాణ్యత పరీక్షల్లో 53 రకాల మందులు ఫెయిల్

image

కొన్ని సంస్థల పారాసెటమాల్ IP 500 MG, విటమిన్ C, D3 షెల్కాల్, విటమిన్ B కాంప్లెక్స్, C సాఫ్ట్‌జెల్స్ త‌దిత‌ర 53 ర‌కాల మందులు నాణ్య‌త పరీక్షల్లో విఫ‌ల‌మైన‌ట్టు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. కాల్షియం, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు Telmisartan ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మందులను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్ తదితర సంస్థలు తయారు చేసినవి. <>జాబితా<<>> ఇదిగో.

News September 25, 2024

హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రాలో కొత్తగా 169 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యుటేషన్‌పై కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 25, 2024

జనాభా వృద్ధిరేటులో తెలుగు రాష్ట్రాలు వెనుకంజ: సర్వే

image

భారత జనాభా వృద్ధిరేటు (2011-24)లో తగ్గుదల కనిపించినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33% వాటాను కలిగి ఉన్నాయి. SBI రీసెర్చ్ ప్రకారం వృద్ధుల జనాభా 2024లో 15 కోట్లు దాటిందని అంచనా. ఇందులో 7.7 కోట్ల మంది మహిళలు, 7.3 కోట్ల మంది పురుషులు ఉన్నారు. వృద్ధుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది.