News September 25, 2024

ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలి: YS జగన్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత YS జగన్ పిలుపునిచ్చారు. ‘తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 25, 2024

నాణ్యత పరీక్షల్లో 53 రకాల మందులు ఫెయిల్

image

కొన్ని సంస్థల పారాసెటమాల్ IP 500 MG, విటమిన్ C, D3 షెల్కాల్, విటమిన్ B కాంప్లెక్స్, C సాఫ్ట్‌జెల్స్ త‌దిత‌ర 53 ర‌కాల మందులు నాణ్య‌త పరీక్షల్లో విఫ‌ల‌మైన‌ట్టు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. కాల్షియం, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు Telmisartan ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మందులను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్ తదితర సంస్థలు తయారు చేసినవి. <>జాబితా<<>> ఇదిగో.

News September 25, 2024

హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రాలో కొత్తగా 169 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యుటేషన్‌పై కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 25, 2024

జనాభా వృద్ధిరేటులో తెలుగు రాష్ట్రాలు వెనుకంజ: సర్వే

image

భారత జనాభా వృద్ధిరేటు (2011-24)లో తగ్గుదల కనిపించినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33% వాటాను కలిగి ఉన్నాయి. SBI రీసెర్చ్ ప్రకారం వృద్ధుల జనాభా 2024లో 15 కోట్లు దాటిందని అంచనా. ఇందులో 7.7 కోట్ల మంది మహిళలు, 7.3 కోట్ల మంది పురుషులు ఉన్నారు. వృద్ధుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది.