News September 25, 2024

ఈ నెల 28న తిరుమలకు కాలినడకన జగన్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమలకు చేరుకుని పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News September 25, 2024

డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించండి: సీఎం

image

TG: దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, అర్హులకు ఇళ్లు దక్కాలని సీఎం రేవంత్ ఆదేశించారు. PMAY కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని అధికారులకు సూచించారు. రాజీవ్ స్వగృహలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్స్, ఇళ్లు వేలం వేయాలని, ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు.

News September 25, 2024

కేక్ కటింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు!

image

వేడుక ఏదైనా అందులో కేక్ కట్ చేయడం ఫ్యాషనైపోయింది. ఆ సమయంలో కొవ్వొత్తులు వెలిగించి ఊదుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘అలా ఊదడం వల్ల నోటిలోని లాలాజలం ద్వారా హానికర బ్యాక్టీరియా కేక్ ఉపరితలానికి చేరుతుంది. బ్యాక్టీరియాతో పాటు కొవ్వొత్తులు కరిగి వాటి రసాయనాలు కడుపులోకి చేరితే అనారోగ్యం పాలవుతారు’ అని తేలింది. దీన్నిబట్టి చూస్తే చిన్నారుల ముఖంపై కూడా ఊదడం మంచిది కాదన్నమాట.

News September 25, 2024

ఏపీలో 16 మంది ఐపీఎస్‌లు బదిలీ

image

☛ సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్
☛ పీ అండ్ ఎల్ ఐజీగా రవిప్రకాశ్
☛ ఇంటెలిజెన్స్ ఐజీగా PHD రామకృష్ణ
☛ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప
☛ డీఐజీ(అడ్మిన్)గా అమ్మిరెడ్డి
☛ రోడ్ సేఫ్టీ డీఐజీగా విజయారావు
☛ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్
☛ విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా మేరీ ప్రశాంతి
పూర్తి <>లిస్ట్<<>> కోసం ఇక్కడ క్లిక్ చేయండి