News September 25, 2024
ఖమ్మం: జిల్లా ప్రధాన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వసతులతో వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఏఎంసీ, జనరల్ వార్డులు, వెయిటింగ్ హాల్, ఐసీయూ, ఫార్మసీ, ఓపీ, ఫిజియోథెరపి రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. అందుతున్న సేవలు, ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
Similar News
News November 17, 2024
ఈనెల 24న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష: DEO
ఖమ్మం: 2024-25 విద్యా సం.కి గాను నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ తెలిపారు. ఉ.9-30 నుంచి మ.12:30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. కావున విద్యార్థులు తమ పరీక్షా హాల్ టికెట్లను వెబ్సైట్ https://bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి పేర్కొన్నారు.
News November 16, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కొడుకు మృతి
చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో పురోహితుడిగా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ శర్మ అతని భార్య లక్ష్మీ హిమబిందు, కుమారుడితో కొత్తగూడెం నుంచి విఎం బంజర వైపు వెళుతున్నారు. మార్గమధ్యలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సతీష్ కుమార్, అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.
News November 16, 2024
చండ్రుగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
చండ్రుగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగూడెం నుంచి బైక్‌పై వస్తున్న ఓ కుటుంబం తిప్పనపల్లి వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.