News September 25, 2024

కాలుష్య నివారణకు ఢిల్లీలో కృత్రిమ వర్షాలు!

image

న‌వంబ‌ర్ నెల‌లో తీవ్ర స్థాయిలో ఉండే కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి కృత్రిమ‌ వ‌ర్షాల సృష్టికి ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. న‌వంబ‌ర్ 1 నుంచి 15 తేదీల మ‌ధ్య వర్షాల సృష్టికి అనుమ‌తుల కోసం కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు లేఖ రాసిన‌ట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 21 పాయింట్ల అజెండాతో కాలుష్య నివార‌ణ‌కు యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేశామ‌ని, ప్ర‌త్యేక బృందాలు, యంత్రాల‌ను మోహ‌రించ‌నున్న‌ట్టు వివరించారు.

Similar News

News September 25, 2024

GREAT: రూ.6కోట్ల విలువైన భవనాన్ని దానం చేశారు!

image

AP: సమాజ హితాన్ని కోరుకుంటూ రూ.కోట్ల ఆస్తిని దానం చేసేవారు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు. తెనాలికి చెందిన డా.ముద్దన కస్తూరిబాయి తమకు చెందిన మహిళా మండలి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. మహిళా సాధికారతను ఆకాంక్షిస్తూ ఆమె రూ.6 కోట్ల విలువ చేసే భవనాన్ని దానం చేయడం స్ఫూర్తిదాయకం అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 25, 2024

‘మేకిన్ ఇండియా’పై రాహుల్ గాంధీ చురకలు

image

మేకిన్ ఇండియా పేరుతో BJP అన్ని కాంట్రాక్టుల‌ను అదానీకి ఇస్తోంద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. JK ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ ఇజ్రాయెల్ త‌యారు చేసే ఆయుధాల‌కు, డ్రోన్ల‌కు అదానీ స్టిక్క‌ర్లు అంటించి దీన్నే మేకిన్ ఇండియా అంటున్నార‌ని, ఇది ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. GST, నోట్లర‌ద్దు వంటివి పాల‌సీలు కావని, అదానీ-అంబానీల‌కు వ్యాపార మార్గాలు సుగ‌మ‌ం చేయ‌డానికి వాడిన ఆయుధాల‌ని రాహుల్ విమ‌ర్శించారు.

News September 25, 2024

చెవిలో పేలిన ఇయర్ బడ్స్.. యువతికి శాశ్వత వినికిడి లోపం

image

టర్కీలో శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడంతో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో పేలిందని యువతి ప్రియుడు తెలిపారు. దీనిపై శాంసంగ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడుకు గల కారణాన్ని వెల్లడించలేదన్నారు. దీంతో సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.