News September 25, 2024

జనాభా వృద్ధిరేటులో తెలుగు రాష్ట్రాలు వెనుకంజ: సర్వే

image

భారత జనాభా వృద్ధిరేటు (2011-24)లో తగ్గుదల కనిపించినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33% వాటాను కలిగి ఉన్నాయి. SBI రీసెర్చ్ ప్రకారం వృద్ధుల జనాభా 2024లో 15 కోట్లు దాటిందని అంచనా. ఇందులో 7.7 కోట్ల మంది మహిళలు, 7.3 కోట్ల మంది పురుషులు ఉన్నారు. వృద్ధుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది.

Similar News

News September 26, 2024

మల్టీ బ్యాగర్ స్టాక్ కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు

image

మ‌ల్టీ బ్యాగ‌ర్ స్మాల్ క్యాప్ స్టాక్ సుద‌ర్శ‌న్ ఫార్మా షేరు బుధ‌వారం సెష‌న్‌లో 5% పెరిగి ₹424కి చేరింది. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులో జ‌రిగే సంస్థ బోర్డ్ మీటింగ్‌లో స్టాక్ స్ల్పిట్‌పై చ‌ర్చించనుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు ఎగ‌బ‌డ్డారు. ఈ షేరు 3 నెలల్లో 416% ర్యాలీ చేయడమే దీనికి ప్రధాన కారణం. ₹10 ఫేస్ వాల్యూ కలిగిన ఈక్విటీ షేర్లను సబ్-డివిజన్/స్ప్లిట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

News September 26, 2024

అద్భుతమైన ఫొటో.. విమానం నుంచి తిరుమల వ్యూ

image

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన మహిమాన్విత క్షేత్రం తిరుమల. తాజాగా ఓ యువకుడు ఫ్లైట్ నుంచి తిరుమల ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేశారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అని, కానీ అత్యాధునిక లెన్స్ ఉపయోగించి ఈ ఫొటో తీశానని Xలో పేర్కొన్నారు. కొండపై నెలవైన వెంకన్నస్వామి కొలువు ఎంత అద్భుతంగా ఉందో కదా!
PHOTO CREDITS: Prudhvi Chowdary

News September 26, 2024

తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా?

image

AP: వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ హయాం నుంచే అన్యమతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేసే సంప్రదాయం ఉంది. వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, దర్శనానికి అనుమతించాలని అందులో సంతకం చేయాలి. 1933 ముందు వరకు మహంతులు దీన్ని పర్యవేక్షించారు.