News September 25, 2024

కేక్ కటింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు!

image

వేడుక ఏదైనా అందులో కేక్ కట్ చేయడం ఫ్యాషనైపోయింది. ఆ సమయంలో కొవ్వొత్తులు వెలిగించి ఊదుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘అలా ఊదడం వల్ల నోటిలోని లాలాజలం ద్వారా హానికర బ్యాక్టీరియా కేక్ ఉపరితలానికి చేరుతుంది. బ్యాక్టీరియాతో పాటు కొవ్వొత్తులు కరిగి వాటి రసాయనాలు కడుపులోకి చేరితే అనారోగ్యం పాలవుతారు’ అని తేలింది. దీన్నిబట్టి చూస్తే చిన్నారుల ముఖంపై కూడా ఊదడం మంచిది కాదన్నమాట.

Similar News

News September 26, 2024

వాట్సాప్‌లో ‘కెమెరా ఎఫెక్ట్స్’ ఫీచర్

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘కెమెరా ఎఫెక్ట్స్’ పేరిట మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో యాప్‌లోని కెమెరాతో ఫొటోస్/వీడియోస్ తీసేటప్పుడు ఫిల్టర్స్ వాడుకోవచ్చు. వీడియో కాల్స్‌లో కూడా ఈ కొత్త విజువల్ టూల్స్‌ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కొందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మిగతా యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.

News September 26, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 26, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:28 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:09 గంటలకు
✒ ఇష: రాత్రి 7.21 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.