News September 25, 2024

దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ?

image

TG: దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4.25 లక్షల మందికి మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే 22 లక్షల మందికి రూ.17,934 కోట్లు మాఫీ చేసింది. రేషన్ కార్డులు లేని రైతులు, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నవారికి, ఇతర సాంకేతిక సమస్యలు, కుటుంబ నిర్ధారణ కానివారికి మాఫీ చేస్తారు. ఇందుకు సంబంధించిన డేటా అప్‌లోడ్ ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగియనుంది.

Similar News

News September 26, 2024

హెల్తీ లంగ్స్ కోసం ఇవి పాటించండి!

image

ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకుంటారు. అందరికీ స్వచ్ఛమైన గాలి అందాలి, హెల్తీ లంగ్స్ ఉండాలనేది ఈ ఏడాది థీమ్‌. హెల్తీ లంగ్స్ కోసం పొగాకు వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్‌ వద్దు. డైలీ వ్యాయామం చేయాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. హెల్తీఫుడ్ తినాలి. ఫ్లూ, నిమోనియాకి టీకాలు తీసుకోవాలంటున్నారు.

News September 26, 2024

సెప్టెంబర్ 26: చరిత్రలో ఈరోజు

image

1932: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జననం
1820: ప్రసిద్ధ బెంగాలీ కవి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జననం
1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం
1947: సంఘ సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి మరణం
1966: సాహిత్యవేత్త అట్లూరి పిచ్చేశ్వరరావు మరణం
✤ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం

News September 26, 2024

జంట జలాశయాలకు భారీ వరద

image

TG: హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.