News September 25, 2024
కనిగిరి మండలంలో బాలుడు ఆత్మహత్య

కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 16, 2025
కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంతో సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ తాడేపల్లికి వెళ్లారు. ఈ దశలోనే కలెక్టర్ల సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.
News September 15, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 58 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు, మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
News September 15, 2025
ప్రకాశంలో ఇంజినీర్ల అద్భుతానికి నిదర్శనం ఇదే!

ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నుంచి నంద్యాల వరకు 60 కి.మీ రహదారి ఉంది. ఇందులో 25 కి.మీ ప్రయాణం ఘాట్ రోడ్డులో ఉంటుంది. స్వాతంత్ర్యం రాకముందు నిర్మించిన రైల్వే పురాతన వంతెనల దిమ్మెలు నేటికీ కనిపిస్తున్నాయి. నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఈ ఘాట్ రోడ్డు అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇంజినీర్లు సృష్టించిన అద్భుతాలకు ఇదో ఉదాహరణ.