News September 26, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా ప్రయాణించే వారికి పండుగ రద్దీ దృష్ట్యా భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు 02811 BBS- YPR రైలును అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం, 02812 YPR- BBS రైలును అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News October 11, 2024

దువ్వాడ శ్రీనివాస్‌, మాధురిపై పెట్టిన కేసులు ఇవే..!

image

తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తిరుమల DSP విజయశేఖర్ స్పందించారు. ‘తిరుమల మాఢ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. ఈవిషయమై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ వాళ్లు మాకు ఫిర్యాదు చేయడంతో BNS 293, 300 సెక్షన్ల కేసు నమోదు చేశాం. తిరుమలలో వ్యక్తిగత విషయాలు మాట్లాడకపోవడం మంచిది’ అని డీఎస్పీ సూచించారు.

News October 11, 2024

నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ

image

మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. నిన్న రాత్రికి జిల్లావ్యాప్తంగా 3,427 దరఖాస్తులు అందినట్లు ప్రొహిబిషన్&ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం 825-32 షాపులు, ఆమదాలవలస 268-13, రణస్థలం 502-15, పొందూరు281-10, నరసన్నపేటలో 193-12, కొత్తూరు 178-7, పాతపట్నం 177-8, టెక్కలి 184-11, కోటబొమ్మాళి 224-15, పలాస 154-15, సోంపేట 233-12,ఇచ్చాపురం 208-8 దరఖాస్తులు వచ్చాయన్నారు.

News October 11, 2024

దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురిపై కేసు నమోదు

image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిపై గురువారం తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తిరుమల క్షేత్రాన్ని దర్శించిన వీరు తిరుమల మాడ వీధుల్లో అభ్యంతరకరంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.