News September 26, 2024
జంట జలాశయాలకు భారీ వరద

TG: హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News February 5, 2026
మేళ్లచెర్వు జాతరకు రూ.కోటి మంజూరు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మేళ్లచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ రూ.1 కోటి నిధులను మంజూరు చేశారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రికి ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జాతర ఈ నెల 15 నుంచి జరగనుంది.
News February 5, 2026
AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్‌ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్‌ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.
News February 5, 2026
బంధంలో ఇది ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


