News September 26, 2024

సెప్టెంబర్ 26: చరిత్రలో ఈరోజు

image

1932: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జననం
1820: ప్రసిద్ధ బెంగాలీ కవి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జననం
1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం
1947: సంఘ సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి మరణం
1966: సాహిత్యవేత్త అట్లూరి పిచ్చేశ్వరరావు మరణం
✤ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం

Similar News

News November 7, 2025

దేవసేన, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: FATHI

image

TG: ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, సీఎం కార్యాలయ అధికారులపై తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ‘FATHI’ అధ్యక్షుడు రమేశ్ Dy.CM భట్టితో చర్చల సందర్భంగా తెలిపారు. తమ కామెంట్స్‌ను వక్రీకరించారన్నారు. దీన్ని ఖండిస్తూ ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇక సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను వర్సిటీ అధికారులతో మాట్లాడి నిర్వహిస్తామని వెల్లడించారు.

News November 7, 2025

మరోసారి ‘నో హ్యాండ్ షేక్’!

image

భారత్, పాక్ క్రికెటర్ల మధ్య ‘నో హ్యాండ్ షేక్’ వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్‌లో, మహిళల ప్రపంచ కప్‌లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇవాళ హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నీలోనూ ఇది రిపీట్ అయింది. ఇండియా మ్యాచ్ <<18225529>>గెలిచిన <<>>కొన్నిక్షణాలకే ప్రసారం ముగిసింది. ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. రెండు టీమ్స్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే ఉండిపోయాయని సమాచారం.

News November 7, 2025

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు ఉండవచ్చా?

image

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్మశానం నుంచి వెలువడే ప్రతికూల తరంగాలు నివాసితులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. ‘దహన సంస్కారాలు జరిగే చోటు నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలై పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ గాలి ఆరోగ్యానికి హానికరం. నిరంతరం అశాంతి, నిరాశ భావాలను పెంచుతాయి’ అని సూచిస్తారు. <<-se>>#Vasthu<<>>