News September 26, 2024

అక్టోబర్ 23 వరకు బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లు

image

బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లను అక్టోబర్ 23లోపు పూర్తి చేసుకోవాలని కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన 2024-25 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సవరించింది. అక్టోబర్ 23లోపు ఫస్టియర్ తరగతులను ప్రారంభించాలంది. లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల గడువును సైతం అక్టోబర్ 23గానే ఖరారు చేసింది.

Similar News

News November 8, 2025

ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు BIG ALERT

image

దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 13, 14, 15, 16 వెర్షన్ల(ఫోన్స్, ట్యాబ్లెట్స్)లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, ఇవి హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమీ, రియల్‌మీ, మోటోరోలా, వివో, ఒప్పో, గూగుల్ పిక్సల్ ఫోన్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. వెంటనే వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

News November 8, 2025

ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేస్తున్న కీటకం

image

ఆయిల్ పామ్ సాగులో పరాగసంపర్కం కీలకం. దీనిపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పంటలో గాలి ద్వారా సంపర్కం సాధ్యం కాదు. అందుకే జగిత్యాల రైతులు ఆయిల్ పామ్ పంటల్లో పరాగసంపర్కం కోసం ఆఫ్రికన్ వీవిల్ అనే కీటకాన్ని వినియోగిస్తున్నారు. చాలా చిన్నగా ఉండే ఈ కీటకం పరాగ సంపర్కానికి కీలక వాహకంగా పనిచేస్తూ దిగుబడి పెరిగేందుకు సహకరిస్తోంది. దీని వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయని జగిత్యాల రైతులు చెబుతున్నారు.

News November 8, 2025

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) చెన్నై యూనిట్‌లో 14 పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 11వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్- సీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్+ఐటీఐ, టెన్త్+నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగినవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. వెబ్‌సైట్: https://bel-india.in/