News September 26, 2024

మిర్చి యార్డుకు 53,149 బస్తాల మిర్చి

image

మిర్చి మార్కెట్ యార్డుకు నిన్న 53,149 బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 51,038 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, 273, 341. 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8.500 నుంచి రూ.17,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 18,000 వరకు లభించింది. ఏసీ కామద్ రకం మిర్చి రూ.9,000 నుండి 16,500 వరకు లభించింది.

Similar News

News January 14, 2026

‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.

News January 14, 2026

బుల్లెట్ బండిని గెలుచుకున్న గుంటూరు కోడి పుంజు

image

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.

News January 14, 2026

గుంటూరు: DLSAలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా న్యాయసేవాధికార సంస్ధ(DLSA)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DLSA కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు
https://Guntur.dcourts.gov.inని సందర్శించాలని సూచించారు.