News September 26, 2024

పదేళ్లలో ఏపీకి రూ.35,491 కోట్ల కేంద్ర నిధులు

image

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఏపీకి 2014-24 మధ్య కాలంలో రూ.35491.57 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన మేరకు కేంద్రం బదులిచ్చింది. పదేళ్లలో ఆర్థిక లోటు భర్తీ కింద రూ.16,078.76 కోట్లు, ఏడు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,750 కోట్లు, రాజధాని నగరంలో మౌలిక వసతుల డెవలప్‌మెంట్‌కు రూ.2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.15,147 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.

Similar News

News September 15, 2025

పవర్‌గ్రిడ్‌లో 866 అప్రంటిస్‌లు.. AP, TGలో ఎన్నంటే?

image

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

News September 15, 2025

ITR ఫైలింగ్ గడువు పొడిగింపు లేదు: IT శాఖ

image

ITR ఫైలింగ్‌కు గడువు పొడిగించలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఐటీ విభాగం నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు.

News September 15, 2025

కాంగ్రెస్‌తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

image

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్‌లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్‌లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.