News September 26, 2024
ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయి రెడ్డి

తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు మంత్రి అచ్చెనాయుడు చేసిన వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి ఖండించారు. ‘దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడంతో మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. నా విధేయతపై జోకులు పేలుస్తున్నావు. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా నేను ఈ జన్మలో కులపార్టీ అయిన టీడీపీలో చేరను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 27, 2025
ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయిలా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగారంలో 10.5℃, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.8℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్లో 11.0℃, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ- 3 ములకాలపల్లిలో 11.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.
News December 27, 2025
టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. అప్లైకి 4రోజులే సమయం

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే (DEC 31) సమయం ఉంది. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1,105 ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PST/PET, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. 2026, FEB, ఏప్రిల్లో CBT ఉంటుంది. https://ssc.gov.in/ *మరిన్ని ఉద్యోగ వివరాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


