News September 26, 2024

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

image

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తలు రద్దీ కొనసాగుతోంది. ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న స్వామి వారిని 77,939 మంది దర్శించుకున్నారు.

Similar News

News March 13, 2025

మడగాస్కర్ అధ్యక్షుడుతో చిత్తూరు MP భేటీ 

image

మడగాస్కర్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జస్టిన్ టోక్లే తన ప్రతినిధి బృందంతో భారత దేశానికి వచ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో పార్లమెంటు సమావేశ మందిరంలో లోకసభ స్పీకర్ ఓం బిర్లా, చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాద్ రావుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. 

News March 13, 2025

పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

image

ఓ కేసు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి M.Rపల్లి మారుతినగర్ పరిధిలో బుగ్గమఠం భూముల ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హై కోర్ట్‌ను ఆశ్రయించారు. అయితే ఈ భూములకు చెందిన ఎలాంటి పత్రాలు పెద్దిరెడ్డి వద్ద లేవని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమంటూ కోర్ట్ తేల్చి చెప్పింది.

News March 12, 2025

పుంగనూరు: రేపు శ్రీవారి కల్యాణోత్సవం

image

పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

error: Content is protected !!