News September 26, 2024
విశాఖలో హర్షసాయి బంధువులను విచారించిన పోలీసులు?

హైదరాబాద్‌లో రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న విశాఖలో HYD పోలీసులు హర్షసాయి బంధువులను విచారించినట్లు సమాచారం. అయితే అతను విజయవాడలో ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షసాయి కేసులో అతడి లాయర్ విజయవాడకు చెందిన టీ.చిరంజీవి సహకారంతో విజయవాడలో తలదాచుకున్నట్లు తాజాగా కథనాలు వెలువడ్డాయి.
Similar News
News March 12, 2026
పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్-1’ మొబైల్ యాప్

విశాఖలో పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్-1’ మొబైల్ యాప్‌ను రూపొందించామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన వివరించారు. వార్డు, సచివాలయ డేటాను విశ్లేషించి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని అన్నారు. ఏఐ చాట్‌బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసి సర్వీస్ నంబర్ ఇస్తామన్నారు. దీంతో కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.
News March 12, 2026
విశాఖకు మరో ఐటీ కంపెనీ

విశాఖలో ప్రముఖ IT సంస్థ క్యాప్‌జెమిని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు ముందు తాత్కాలిక కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికోసం సెంట్రల్ పార్కు రోడ్డులోని భవనాన్ని అద్దెకు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధురవాడ IT హిల్స్, కొమ్మాది, ఆనందపురం ప్రాంతాల్లో 25-30 ఎకరాల భూమిని పరిశీలిస్తున్నారు. ఈ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ నేడు భేటీ కానున్నారు.
News March 11, 2026
విశాఖ జిల్లాలో రికార్డ్ లెవల్లో రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

సైబర్ నేరాల బాధితులకు రిఫండ్ అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 1,240 మంది బాధితులకు రూ. 22.47 కోట్లు రిఫండ్ చేయగా, 558 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లోన్ యాప్ కేసుల్లో రూ. 60 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్నారు. మోసపోతే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.


