News September 26, 2024
విజయవాడ: దసరా ఉత్సవాలకు 964 ప్రత్యేక బస్సులు
దసరా ఉత్సవాలకు విజయవాడకు వచ్చేవారి కోసం 964 ప్రత్యేక బస్సులు నడుపుతామని APSRTC తెలిపింది. ఈ బస్సులను అక్టోబర్ 3- 15 వరకు 13 రోజులపాటు నడుపుతామంది. అదే సమయాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నందున HYD నుంచి విజయవాడకు బస్సులలో 353 సర్వీసులు నడుపుతామని తెలిపింది. రాజమండ్రి రూట్లో 241, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చేందుకు మిగతా బస్సులు నడుపుతామని RTC తెలిపింది.
Similar News
News November 24, 2024
విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఏలూరు కాలువలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు కాలువలో దిగి ఆడుతూ లోతుకి వెళ్లారు. వారిని బయటకి తీసుకువచ్చే లోపు వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y24 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారంలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, ఫీజు పేమెంట్ వివరాలకై https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది.
News November 24, 2024
విజయవాడ: ఇన్స్టాగ్రామ్లో పరిచయం, పెళ్లి.. కేసు నమోదు
మైనర్ బాలికను మోసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుణదల పోలీసుల వివరాల మేరకు.. ఏలూరుకి చెందిన పద్మావతి అనే బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. పద్మావతి 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా రాంపండును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రాంపండు కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో వారిపై కేసు నమోదు చేశామని గుణదల పోలీసులు శనివారం తెలిపారు.