News September 26, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డిజిటల్ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఎస్.జే.సూర్య విలన్‌గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా సందడి చేశారు.

Similar News

News September 18, 2025

మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

image

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్‌ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.

News September 18, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.

News September 18, 2025

కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.