News September 26, 2024

మనూ భాకర్ ఇన్‌స్పైరింగ్ ట్వీట్

image

తన లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడిన తీరును ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ గుర్తుచేసుకున్నారు. ‘నాకు 14 ఏళ్లు ఉన్నపుడు షూటింగ్ ప్రయాణం ప్రారంభించా. మీరు ఏదైనా ప్రారంభించిన తర్వాత మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని పూర్తిచేసేందుకు సాధ్యమైనవన్నీ చేయండి. లక్ష్య సాధనకు కట్టుబడి, ఏకాగ్రతతో మీ ప్రయాణం కొనసాగించండి. ఒలింపిక్‌లో స్వర్ణం సాధించే నా కల కోసం కష్టపడుతూనే ఉంటా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 6, 2026

బంగారు పేపర్లతో భగవద్గీత

image

కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను సమర్పించారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో రూపొందిన ఈ గ్రంథాన్ని విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరించనున్నారు.

News January 6, 2026

AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు

image

TG: IIT హైదరాబాద్‌లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. సగటు వార్షిక ప్యాకేజీ రూ.30 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా AI విభాగంలో 83.3% విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ రావడం విశేషం. CSE విద్యార్థి ఎడ్వర్డ్ <<18734504>>వర్గీస్‌<<>>కు రూ.2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.

News January 6, 2026

కుంకుమ పువ్వు, కూరగాయలతో ఏటా రూ.24 లక్షల ఆదాయం

image

అధునాతన వ్యవసాయ పద్ధతుల్లో హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వును సాగు చేస్తూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఒడిశాకు చెందిన సుజాతా అగర్వాల్. తన ఇంట్లోనే 100 చ.అడుగుల గదిలో మూడేళ్లుగా ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వును, హైడ్రోపోనిక్స్ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ సాగు చేసి విక్రయిస్తూ ఏటా రూ.24 లక్షల ఆదాయం పొందుతున్నారు. సుజాతా సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.