News September 26, 2024
షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం?
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్‌కు స్వస్తి పలికినట్లు సమాచారం. ఈ ఏడాది చివరన మిర్‌పుర్‌లో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు తన చివరి మ్యాచ్ అని ఆయన ఇప్పటికే ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా షకీబ్ ఇప్పటివరకు బంగ్లా తరఫున 70 టెస్టులాడారు. 4,600 పరుగులతోపాటు 242 వికెట్లు తీశారు.
Similar News
News December 21, 2024
సీఎం సోదరుడి వల్ల వ్యక్తి చనిపోతే ఎందుకు చర్యల్లేవు?: హరీశ్
TG: అబద్ధాల్లో CM రేవంత్ రెడ్డి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధాకరమని హరీశ్ అన్నారు. కానీ సీఎం సోదరుడి వల్ల ఓ వ్యక్తి చనిపోతే చర్యల్లేవని, వాంకిడి హాస్టల్‌లో విషాహారం తిని బాలిక చనిపోతే మంత్రులెవరూ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
News December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.
News December 21, 2024
కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ <<14942476>>అసెంబ్లీలో<<>> సీఎం రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై ఆయనతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.