News September 26, 2024
MDK: బీఆర్ఎస్ పాలనలో సువర్ణ అధ్యాయం: హరీశ్‌రావు

తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని హరీశ్ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. పంటల సాగులో తెలంగాణ మేటి అని అన్నారు. దేశానికే మన తెలంగాణ ఆదర్శమని చెప్పారు. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదని ఎక్స్ వేదికగా తెలిపారు.
Similar News
News January 13, 2026
మెదక్: సంరక్షణ కిట్లు అందజేయడం హర్షణీయం: కలెక్టర్

రైతులు పురుగుమందులు పిచికారి చేసే సమయంలో వారి ఆరోగ్య పరిరక్షణకు సంరక్షణ కిట్లు అందజేయడం జిల్లా వ్యవసాయ శాఖ పనితీరు హర్షణీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా పూల బొకేలుకు బదులు సంరక్షణ కిట్లు అందజేయాలన్న కలెక్టర్ పిలుపుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
News January 13, 2026
మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టింగ్‌లు

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజానర్సింహా, ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులు మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
News January 13, 2026
‘మెదక్ జిల్లాను ఛార్మినార్ జోన్‌లో కలపాలి’

మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి తొలగించి, చార్మినార్ జోన్‌లో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఉద్యోగ సంఘాలు వినతిపత్రం అందజేశాయి. ప్రస్తుత జోన్ వల్ల పదోన్నతుల్లో ఉద్యోగులకు, ఉద్యోగ అవకాశాల్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై పునరాలోచన చేస్తున్న తరుణంలో, మెదక్‌ను చార్మినార్ జోన్‌లో చేర్చి న్యాయం చేయాలని కోరారు.


