News September 26, 2024
500+ T20లు ఆడింది కేవలం ఆరుగురే

కీరన్ పొలార్డ్ – 684, డ్వేన్ బ్రావో – 582 , షోయబ్ మాలిక్ – 542, సునీల్ నరైన్ – 525, ఆండ్రీ రసెల్ – 523, డేవిడ్ మిల్లర్ – 500.
ఈ లిస్టులో మిల్లర్ మినహా అందరూ ఆల్‌రౌండర్లే. పైగా విండీస్ వాళ్లే ఎక్కువ. ప్రపంచంలోని అన్ని లీగుల్లో ఆడటమే ఇందుకు కారణం. IPL, BBL, CPL, SA20, MLC, PSL సహా దేన్నీ వదలరు. సిక్సర్లు దంచుతూ, వికెట్లు తీస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తారు కాబట్టే ఫ్రాంచైజీలు వీరికోసం ఎగబడతాయి.
Similar News
News February 27, 2025
కుంభమేళాలో పాల్గొంటే బీజేపీకి దగ్గరయినట్టా?: డీకే

తాను బీజేపీకి దగ్గరవుతున్నానని వస్తున్న పుకార్లన్నీ అబద్ధాలేనని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ స్పష్టం చేశారు. ‘నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని. అయితే నా వ్యక్తిగత నమ్మకాలను నేను అనుసరిస్తాను. హిందువుగా పుట్టాను. హిందువుగానే జీవిస్తాను. హిందువుగానే మరణిస్తాను. కుంభమేళాకు వెళ్లినంత మాత్రాన బీజేపీకి దగ్గరవుతున్నానని చెబుతారా? కుంభమేళాకు యూపీ ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేసింది’ అని తెలిపారు.
News February 27, 2025
ఘోరం: ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం

పుణేలో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సులో యువతి(26)పై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సతారా జిల్లా ఫల్తాన్‌కు చెందిన యువతి పుణేలోని ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. ఊరికి వెళ్లేందుకు స్వర్గేట్ బస్టాండ్‌కు వచ్చింది. బస్సు పక్కన నిలిపి ఉందని ఆమెను తీసుకెళ్లిన నిందితుడు రేప్ చేశాడు.
News February 27, 2025
Stock Markets: బ్యాంకు, మెటల్ షేర్ల జోరు

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సెంటిమెంటు నెగటివ్‌గా ఉండటమే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,559 (+11), సెన్సెక్స్ 74,639 (+40) వద్ద కొనసాగుతున్నాయి. INDIA VIX 13.37కు దిగిరావడం అనిశ్చితి తగ్గడాన్ని సూచిస్తోంది. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లకు గిరాకీ ఉంది. ఆటో, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి.