News September 26, 2024
సనాతన ధర్మం అంటే ఏంటి?

సనాతనం అంటే శాశ్వతమైన, పవిత్రమైన, స్థిరమైన అని అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వతంగా నిలిచే ధర్మం అని పండితులు చెబుతారు. హిందువులు తమను తాము సనాతన వాదులుగా పిలుచుకుంటారు. అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించేవారని అర్థం. హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం అని ప్రవచనకర్తలు నిర్వచిస్తారు. ‘హిందూ’ అనే పదం భౌగోళిక గుర్తింపు కారణంగా విదేశీయుల నుంచి వచ్చిందని సద్గురు చెబుతారు.
Similar News
News September 17, 2025
యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.
News September 17, 2025
గాలికుంటు వ్యాధి టీకాలు వేయించారా?

AP: పశువుల్లో ప్రమాదకరమైన <<17696053>>గాలికుంటు<<>> వ్యాధి నివారణకు ఈ నెల 15 నుంచి టీకాలు వేస్తున్నారు. వచ్చేనెల 15 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పాడిరైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.
News September 17, 2025
ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు

PM మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల సంక్షేమం, వికసిత్ భారత్ కోసం మీ సంకల్పం మాకు స్ఫూర్తి’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘రాజకీయాలంటే సేవ అని, అధికారం కాదు త్యాగమని నేర్పిన ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సంజయ్ అన్నారు. PM మోదీకి ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ LoP రాహుల్ గాంధీ, TG CM రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.