News September 26, 2024
నేను రిటైర్ అవడానికి కారణం అదే: శిఖర్ ధవన్

క్రికెట్ ఆడాలన్న ఆసక్తి లేకపోవడం వల్లే తాను రిటైరయ్యానని భారత మాజీ బ్యాటర్ శిఖర్ ధవన్ తెలిపారు. ‘రెండేళ్ల నుంచి నాకు పెద్దగా క్రికెట్ అవకాశాల్లేవు. ఐపీఎల్ మాత్రమే ఆడాను. దేశవాళీ క్రికెట్ అసలు ఆడాలనిపించలేదు. ఆటపై ఆసక్తి తగ్గిపోయిందని అర్థమై తప్పుకొన్నా. నా కెరీర్లో సాధించిన దాని పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నా’ అని వివరించారు. భారత్ తరఫున ధవన్ 34 టెస్టులు, 167 ODI, 68 T20I మ్యాచులు ఆడారు.
Similar News
News September 17, 2025
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. పాక్ ఆడుతుందా?

ఆసియా కప్‌లో పాకిస్థాన్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. షేక్‌హ్యాండ్ వివాదంలో <<17723523>>పాక్ డిమాండ్<<>>ను ICC తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే UAEతో మ్యాచ్‌లో దాయాది దేశం ఆడుతుందా? టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకోగానే తప్పుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో సందిగ్ధత కొనసాగుతోంది.
News September 17, 2025
US జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు: పాకిస్థాన్

OP సిందూర్ నిలిపివేయడం వెనుక అమెరికా హస్తంలేదని తాజాగా పాక్ ఉప ప్రధాని మహ్మద్ ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. ‘మేము US విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో తృతీయ పక్షం జోక్యం గురించి చెప్పాం. బయటి వ్యక్తుల ప్రమేయానికి భారత్ ఒప్పుకోవట్లేదని ఆయన మాతో చెప్పారు. వాష్గింగ్టన్‌లో మళ్లీ నేను అదే ప్రస్తావించాను. ఇది పూర్తిగా ద్వైపాక్షికంగానే పరిష్కారమవ్వాలని ఇండియా తెగేసి చెప్పినట్లు బదులిచ్చారు’ అని తెలిపారు.
News September 17, 2025
దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.