News September 26, 2024

బరువు తగ్గేందుకే పవన్ దీక్ష: సీమాన్

image

కల్తీ నెయ్యితో చేసిన తిరుమల లడ్డూలు తిని ఎవరైనా చనిపోయారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడులోని NTK పార్టీ చీఫ్ సీమాన్.. తాజాగా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ బరువు తగ్గేందుకే దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా ఉండి లడ్డూపై రాజకీయాలు తగవన్నారు. లడ్డూపై కార్తీ చేసిన కామెంట్లలో ఎలాంటి తప్పూ లేదని, సినిమాలు అడ్డుకుంటారనే భయంతోనే ఆయన క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు.

Similar News

News December 30, 2024

సర్వ శిక్షా ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం

image

TG: కేజీబీవీల్లో పనిచేసే సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సమ్మె విరమిస్తే వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. 25 రోజులుగా సమ్మె చేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థికపరమైన డిమాండ్స్‌పై క్యాబినెట్ సబ్ కమిటీ‌ భేటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

News December 30, 2024

దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరంటే?

image

భారత్‌లో రిచెస్ట్ CMగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (₹931కోట్లు) నిలిచారు. ఆయన చరాస్తుల విలువ ₹810cr కాగా స్థిరాస్తుల విలువ ₹121crగా ఉంది. ఇక ఈ లిస్టులో అరుణాచల్ CM పెమా ఖండు (₹332cr) రెండో స్థానంలో, కర్ణాటక CM సిద్దరామయ్య (₹51cr) మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా ప.బెంగాల్ CM మమతా బెనర్జీ (₹15లక్షలు) నిలిచారు. J&K CM ఒమర్ ₹55లక్షలు, కేరళ CM విజయన్ ₹కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు.

News December 30, 2024

మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కాంగ్రెస్‌

image

మ‌న్మోహ‌న్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థిక‌ల‌ను య‌మునా న‌దిలో క‌లిపే కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు పాల్గొన‌లేదని కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది. అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌న్మోహ‌న్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ క‌లిసి పరామర్శించారని తెలిపింది. అస్థిక‌లు న‌దిలో క‌లిపే విష‌య‌మై వారితో చ‌ర్చించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కాంగ్రెస్ వెల్ల‌డించింది.