News September 26, 2024
ఎన్టీఆర్, కార్తీ సినిమాలకు ఆల్ ది బెస్ట్: సాయి ధరమ్

ఎన్టీఆర్ ‘దేవర’, కార్తీ ‘సత్యం సుందరం’ సినిమాలకు సాయి ధరమ్ తేజ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘భారీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్న తారక్‌కు, కళ్యాణ్ రామ్, అనిరుధ్, కొరటాల శివ, సైఫ్, జాన్వీ, మొత్తం బృందానికి ఆల్ ది బెస్ట్. సినిమా బ్లాక్‌బస్టర్‌కి తక్కువ కాకూడదు. కార్తీ అన్న, ప్రేమ కుమార్ ‘సత్యం సుందరం’ వంటి సినిమాను మన వద్దకు తీసుకొస్తుండటం చాలా సంతోషంగా ఉంది. వారి టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 27, 2025
‘మేక్ ఇన్ ఇండియా’తో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు: కేంద్రమంత్రి

ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’తో పరుగులు పెడుతోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘2014-15మధ్య 2 మొబైల్ తయారీ యూనిట్స్ ఉంటే ఇప్పుడు 300కు పెరిగాయి. రూ.18వేల కోట్లుగా ఉండే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి రూ.5.5లక్షల కోట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.11.3 లక్షల కోట్లకు, వాటి ఎగుమతి రూ.3.3లక్షల కోట్లకు పెరిగింది’ అని <
News December 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.
News December 27, 2025
టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. అప్లైకి 4రోజులే సమయం

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే (DEC 31) సమయం ఉంది. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1,105 ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PST/PET, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. 2026, FEB, ఏప్రిల్‌లో CBT ఉంటుంది. https://ssc.gov.in/ *మరిన్ని ఉద్యోగ వివరాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


