News September 26, 2024
బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రెండు రోజులే ఛాన్స్!

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 250 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈనెల 28తో ముగియనుంది. B.E/ B.Techలో (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్) 60% మార్కులు సాధించిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ రూ.60వేల నుంచి రూ.1.8లక్షల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకునేందుకు ఈ <
Similar News
News February 6, 2026
గల్ఫ్ దేశాలతో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమైన భారత్

ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్స్ కొనసాగుతున్న వేళ భారత్ వరుస వాణిజ్య ఒప్పందాలతో దూసుకుపోతోంది. EU, USA తర్వాత ఇప్పుడు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (GCC)లోని 6 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు చర్చలు మొదలు పెట్టింది. ఈ ఒప్పందం కుదిరితే ఎగుమతులు, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. UAE, ఒమన్‌తో ఇప్పటికే డీల్స్ అమల్లో ఉండగా సౌదీ, ఖతర్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలతోనూ సంబంధాలు బలపడనున్నాయి.
News February 6, 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 6, 2026
గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

దేశంలో ఉద్యోగ మార్కెట్ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్ పేజ్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్ హెడ్స్‌కు డిమాండ్ పెరిగిందని తెలిపింది.


