News September 26, 2024
కృష్ణా: ‘అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు’

కృష్ణా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.
Similar News
News January 12, 2026
కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌కు సన్నాహాలు..!

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 4 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంకలో ఉన్న ఇసుక రీచ్‌లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఘంటసాల మండలం పాపవినాశనంలో మరో రీచ్‌ను ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 12, 2026
కృష్ణా: రికార్డు స్థాయి పందేం ఇదే.. అందరి నోట ఒక్కటే మాట!

కోడి పందేల చరిత్రలో రికార్డు స్థాయి పందేలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సీసలి బరిలో జరిగిన రూ. 25 లక్షల పందెం ఒక ఎత్తైతే, తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 1.25 కోట్ల పందేం జరగడం పందెం రాయుళ్లను విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రభాకర్ ఈ భారీ పందేంలో నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో పందేలకు క్రేజ్ అమాంతం పెరిగింది.
News January 12, 2026
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.


