News September 27, 2024

గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వండి: హరీశ్ రావు

image

TG: గ్రామ పంచాయతీలకు నిధులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 8 నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు రిలీజ్ చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన లేఖ రాశారు. కేంద్రం రూ.1,200 కోట్లు కేటాయించినా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. పంచాయతీ కార్మికులకు దసరా, దీపావళికైనా జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News February 8, 2026

నింగిలో నిఘా: శత్రు ఉపగ్రహాలపై భారత్ సరికొత్త ‘స్నూపింగ్’!

image

అహ్మదాబాద్‌కు చెందిన ‘అజిస్తా’ సంస్థ కక్ష్యలో ఉన్న ఇతర ఉపగ్రహాలను ఫొటోలు తీసే (In-orbit imaging) సామర్థ్యాన్ని నిరూపించింది. ఇండియన్ టెక్నాలజీతో తయారైన AFR శాటిలైట్.. వేగంగా కదులుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పష్టంగా ఫొటోల్లో బంధించింది. శత్రువుల కదలికలను పసిగట్టడానికి, అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి, క్షిపణులను ట్రాక్ చేయడానికి ఈ ‘స్పేస్ స్నూపింగ్’ భారత్‌కు కీలకం కానుంది.

News February 8, 2026

CIPETలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ(CIPET)11 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 9 -మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME/MTech, PhD, MBA, PG పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు మేనేజర్‌కు రూ.78,800, Sr. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.67,700 చెల్లిస్తారు. సైట్: https://www.cipet.gov.in

News February 8, 2026

జైలుకెళ్లిన ప్రముఖ జ్యోతిషుడు.. బ్యాగ్రౌండ్ చూస్తే

image

కర్ణాటక జ్యోతిషుడు కమలాకర్ భట్ ఫ్లాష్‌బ్యాక్ సినిమా స్టోరీనే. తమలపాకులు, మరమరాలు అమ్మిన ఆయన.. జ్యోతిషుడైతే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో 2005లో కేరళలో ఆ విద్య నేర్చాడు. త్వరగా పాపులరవ్వాలని TVల్లో ఆస్ట్రాలజీ చెప్పాడు. సమస్యలున్న వారిని తీసుకొచ్చే ఏజెంట్లకు కమీషన్ ఇస్తూ ₹వందల కోట్లు పోగేశాడు. ఏజెంట్ సుచిత్రతో అక్రమసంబంధం సాగిస్తూ, అడ్డుగా ఉన్నారని ఆ కుటుంబంపై గతవారం దాడి చేయించి జైలుకెళ్లాడు.