News September 27, 2024
పాడేరు: ఈనెల 27న మీకోసం కార్యక్రమం రద్దు

ఈనెల 27వ తేదీ శుక్రవారం జరగనున్న మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఫిర్యాదుదారులకు ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పీఓ ప్రకటించారు. ఫిర్యాదుదారులు గమనించి నీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు అందజేయడానికి రావద్దని పిఓ విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 4, 2026
గాజువాక లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య.. పక్కనే ‘సూసైడ్ నోట్’

గాజువాకలోని ఓ లాడ్జిలో మోహన్ రాజు అనే వ్యక్తి శనివారం రాత్రి <<18758829>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఉదయం ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘షేర్ మార్కెట్ నా జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చెప్పినా వినకొండ పెట్టుబడి పెట్టి నష్టపోయాను. అశ్విని నీకేమీ చేయలేకపోయాను తల్లి. ఎవరినీ సహాయం అడగాలనిపించలేదు’ అంటూ 7 పేజీల నోట్ రాసి ఉంది.
News January 4, 2026
VCSC నూతన కార్యవర్గం ప్రకటన.. పౌర భద్రతే లక్ష్యం

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మార్గదర్శకత్వంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, మహిళా-శిశు సంరక్షణ, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్ విభాగాలకు ప్రత్యేక ఫోరమ్‌లను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, ‘జూనియర్ కాప్’, ‘సైబర్ వారియర్స్’ వంటి కార్యక్రమాల ద్వారా పోలీస్-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.