News September 27, 2024
సచిన్ రికార్డు విరాట్‌కు దక్కకపోవచ్చు: హాగ్

టెస్టు క్రికెట్‌లో సచిన్ అత్యధిక పరుగుల(15,921) రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీ(8871) వల్ల కాకపోవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. ‘విరాట్ ఆ రికార్డును అందుకుంటారని అనుకోను. ఆయన లయ కోల్పోయారు. వచ్చే 10 మ్యాచుల్లో గాడిలో పడకపోతే ఇక ఆ రికార్డు రేసు నుంచి విరాట్ తప్పుకొన్నట్లే. ఇప్పటికే 12వేల పరుగులకు చేరుకున్న జో రూట్‌కు సచిన్‌ను దాటే ఛాన్స్ ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.
News November 6, 2025
పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.
News November 6, 2025
ఏకగ్రీవ ఎన్నిక ఓటుస్వేచ్ఛను దెబ్బతీయడం కాదు: కేంద్రం, ఈసీ

ఓటు స్వేచ్ఛ ఓటు హక్కుకు భిన్నమైనదని కేంద్రం, ECలు సుప్రీంకోర్టుకు నివేదించాయి. ఒక్క అభ్యర్థే ఉన్నప్పుడు ఏకగ్రీవ ఫలితం ప్రకటించడమంటే ‘నోటా’ అవకాశాన్ని కాదనడమేనన్న పిటిషన్‌పై అవి సమాధానమిచ్చాయి. ‘ఓటుహక్కు చట్టబద్ధం. ఓటుస్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. పోలింగ్ జరిగినప్పుడే ఓటు స్వేచ్ఛ వర్తిస్తుంది’ అని పేర్కొన్నాయి. పోలింగే లేనప్పుడు రాజ్యాంగహక్కును దెబ్బతీసినట్లు కాదని తెలిపాయి. దీనిపై SC విచారణ చేపట్టింది.


