News September 27, 2024
పాకిస్థాన్ అమ్మాయి కోసం బోర్డర్ దాటబోయాడు.. కానీ!

ఆన్లైన్లో పరిచయమైన ఓ పాకిస్థాన్ అమ్మాయి కోసం J&Kకు చెందిన ఇంతియాజ్(36) బోర్డర్ దాటబోయాడు. IND-PAK సరిహద్దులోని ఖవ్దా గ్రామంలో అతడిని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడకు చేరుకున్న ఇంతియాజ్ సులభంగా బోర్డర్ దాటవచ్చని భావించాడు. అతడి అనుమానాస్పద కదలికలు చూసి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించి ఇంటికి పంపారు.
Similar News
News January 26, 2026
RITESలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 26, 2026
ప్రెగ్నెన్సీలో నిద్రపట్టట్లేదా? ఈ టిప్స్ పాటించండి

నెలలు నిండే కొద్దీ గర్భిణుల్లో నిద్రలేమి పెరుగుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో డాక్టర్లు చెబితే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు లైట్‌గా కాళ్లు, చేతులు, తల మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News January 26, 2026
అమెరికా సీక్రెట్ వెపన్ పేరు చెప్పిన ట్రంప్

వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకునే ఆపరేషన్‌లో ‘డిస్కాంబోబులేటర్’ అనే సీక్రెట్ వెపన్ ఉపయోగించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రత్యర్థి సైనిక పరికరాలు పూర్తిగా పనిచేయకుండా చేశామని, వారి వద్ద రష్యా, చైనా రాకెట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా తమపై ప్రయోగించలేకపోయారని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వారిపై దాడులు మరింత విస్తరిస్తామని, అవసరమైతే మెక్సికో వరకూ చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.


