News September 27, 2024

ప్రశాంత్ వర్మ చేతికి బాలయ్య ల్యాండ్ మార్క్ సినిమాలు?

image

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలు రెండు మైలురాళ్లు. వాటి సీక్వెల్స్ ఆలోచన తనకుందని ఆయన పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞ హీరోగా అవి తెరకెక్కుతాయని సమాచారం. ప్రశాంత్ మోక్షుతో తీస్తున్న సినిమా అవుట్‌పుట్‌ను బట్టి ఆ ప్రాజెక్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

Similar News

News September 27, 2024

నేడు ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రారంభం

image

TG: విదేశాల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా HYDలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కోసం ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్య ఒక వారధిలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

News September 27, 2024

‘దేవర’లో కొన్ని సీన్లు కట్ చేశారా?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా థియేటర్లలో రిలీజైంది. అభిమానులు ప్రీమియర్ షోల్లో సందడి చేస్తున్నారు. హిందీలో కూడా ఇంతే క్రేజ్‌తో భారీ ఎత్తున రిలీజవుతోంది. అయితే 2.50 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీని హిందీ ప్రేక్షకుల కోసం 7 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నటీనటులకు సంబంధించిన కొన్ని సోలో సన్నివేశాలను కత్తిరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

News September 27, 2024

శ్రీశైలానికి అతి పెద్ద ఫ్లైఓవర్

image

TG: రాష్ట్రంలోని మన్ననూర్ నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు 55 KM మేర అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం, NTCAకు పంపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.7,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది కార్యరూపం దాలిస్తే దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్‌గా నిలవనుంది. మన్ననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం వెళ్లవచ్చు.