News September 27, 2024

భద్రతామండలిలో భారత్ కచ్చితంగా ఉండాలి: ఫ్రాన్స్

image

భద్రతామండలి(UNSC)లో భారత్‌ను చేర్చాలని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మండలిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు UNSCలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే. అదే విధంగా ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు సభ్యత్వం ఇవ్వాలి. పలు నిబంధనల్నీ మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రోన్ స్పష్టం చేశారు.

Similar News

News September 27, 2024

నేడు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్?

image

AP: నూతన మద్యం విధానానికి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 3,736 వైన్ షాపులు ఏర్పాటు చేస్తారు. వీటిలో 340 దుకాణాలను గీత కార్మికులకు కేటాయిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 10 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 50 వేలలోపు ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షలలోపు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల పైన ఉంటే రూ.85 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించాలి.

News September 27, 2024

తొలి దశలో 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

image

TG: రాష్ట్రంలో తొలి దశలో భాగంగా 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తుందని సమాచారం. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, రెవెన్యూ సిబ్బందితో కలిపి గ్రామ కమిటీ వేయనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేనివారికి ఇవ్వనుంది.

News September 27, 2024

MBBS కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

image

TG: రాష్ట్రంలో MBBS ప్రవేశాల కోసం వెబ్‌ఆప్షన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ రోజు ఉ.6గంటల నుంచి ఈ నెల 29వ తేదీ సా.6గంటలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కన్వీనర్ కోటా కింద దివ్యాంగులు, EWS, PMC, సైనిక ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల కోసం tspvtmedadm.tsche.inను సందర్శించాలి.