News September 27, 2024
పునరావసం కల్పించాకే ఇళ్లు కూల్చండి: తమ్మినేని
TG: మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చే పనులు చేపట్టాలన్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే బలహీనవర్గాల ప్రజలే అక్కడ ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారికి HYD శివార్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే పనులకు వెళ్లేందుకు కష్టతరంగా మారుతుందని తెలిపారు.
Similar News
News December 30, 2024
జనసేనలో చేరిన గంజి చిరంజీవి, జయమంగళం
AP: మంగళగిరి వైసీపీ నేత గంజి చిరంజీవి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఈయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ (కైకలూరు) సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
News December 30, 2024
మదనపల్లె ఫైల్స్ దహనం.. ప్రధాన నిందితుడు గౌతమ్ అరెస్ట్
AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో అతడిని అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. గౌతమ్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. జులై 21న జరిగిన అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
News December 30, 2024
₹21 వేల కోట్లకు డిఫెన్స్ ఎగుమతులు: రాజ్‌నాథ్
దశాబ్ద కాలంలో డిఫెన్స్ ఎగుమతులు ₹2 వేల కోట్ల నుంచి ₹21 వేల కోట్లకు పెరిగాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆర్మీ వార్ కాలేజీలో ఆయన మాట్లాడుతూ 2029 నాటికి ₹50 వేల కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. AI, సైబర్, స్పేస్ ఆధారిత సవాళ్లు అధికమవుతున్న నేపథ్యంలో సైన్యం వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలన్నారు. మహూలో శిక్షణ కేంద్రాల పనితీరును రాజ్‌నాథ్ అభినందించారు.