News September 27, 2024
NZB: నేటి నుంచి DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

2008 DSC ద్వారా 70, 30% ఎంపికైన తెలుగు మీడియం SGT అభ్యర్థులకు ఈ నెల 27- అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని NZB DEO దుర్గాప్రసాద్ తెలిపారు. అభ్యర్థులకు సంబంధించిన జాబితాను www.schooledu.telangana.gov.in వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో కూడిన 2 జిరాక్సు సెట్లతో ఉదయం 10:30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు.
Similar News
News May 7, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి

NZB ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రి రేకుల షెడ్డు కింద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి జేబులో తినాలి రవి, ఆర్మూరు మండలం మామిడిపల్లి అనే ఆధార్ కార్డు ఉందన్నారు.
News May 7, 2025
నిజామాబాద్: బావిలో పడి వ్యక్తి మృతి

జక్రాన్‌పల్లిలో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన మాడవీరి ముత్యం(50) తాగిన మైకంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావిలో మృతదేహం తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపతి మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 7, 2025
NZB: జిల్లా వాసికి జాతీయ అవార్డు

నిజామాబాద్ జిల్లా వాసికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వచ్చే నెల 13న రాష్ట్రపతి భవన్‌లో జరిగే సమావేశంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ను జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.