News September 27, 2024

శ్రీశైలానికి అతి పెద్ద ఫ్లైఓవర్

image

TG: రాష్ట్రంలోని మన్ననూర్ నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు 55 KM మేర అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం, NTCAకు పంపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.7,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది కార్యరూపం దాలిస్తే దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్‌గా నిలవనుంది. మన్ననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం వెళ్లవచ్చు.

Similar News

News September 27, 2024

సరోగసీ తల్లికీ 6 నెలల మాతృత్వ సెలవు

image

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజులపాటు మాతృత్వ సెలవులు ప్రకటిస్తూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. సరోగసీ తండ్రులకూ 15 రోజులపాటు పితృత్వ సెలవులు ఉంటాయని పేర్కొంది. తొలి రెండు కాన్పులకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సరైన మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుందని సూచించింది.

News September 27, 2024

కర్ణాటక.. అడగ్గానే కుంకీ ఏనుగులను ఇచ్చింది: పవన్

image

AP: అడగ్గానే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ‘ఏనుగుల దాడులను ఎదుర్కొనే సమర్థత కర్ణాటకకు ఉందని తెలిసింది. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కుంకీ ఏనుగులు కావాలని కోరాం. వెంటనే స్పందించి వాటిని అందజేసింది. చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వీటిని తరలించి ఏనుగుల దాడిని అరికడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 27, 2024

రేషన్‌కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి

image

TG: రేషన్‌కార్డు లేని నిరుపేదలకూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయన్నారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్/పర్సన్ ఇన్‌ఛార్జి, గ్రామ కార్యదర్శి, ముగ్గురు సేవా కార్యకర్తలుంటారని తెలిపారు. అవసరమైతే ఇళ్ల సంఖ్య పెంచుతామన్నారు.