News September 27, 2024
Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.
Similar News
News November 9, 2025
మూసాపేటలో హైడ్రాకు మద్దతు.. ప్లకార్డులతో హర్షం

హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కబ్జాల నుంచి పార్కులను విడిపించుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని ఏళ్లుగా పోరాడామో హైడ్రా రావడంతో అవన్నీ మా సొంతం అయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్లో పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 3, 2025
రంగారెడ్డి: ప్రజావాణికి 25 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.


