News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, కొండారెడ్డి బురుజు, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్ ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

Similar News

News October 10, 2024

నంద్యాల: భోధనంలో పిడుగు

image

బండిఆత్మకూరు మండలం భోధనం గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం వర్షానికి ముందు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడింది. ఎవరూ లేని చోట ఉన్న వృక్షంపై పిడుగు పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.

News October 10, 2024

నంద్యాల: కొబ్బరి బొండంపై నవదుర్గల చిత్రాలు

image

ఆళ్లగడ్డకు చెందిన ఆర్టిస్టు విజయ్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొబ్బరి బొండంపై నవదుర్గ మాతల చిత్రాలను అక్రిలిక్ రంగులతో తీర్చిదిద్దారు. ఆది పరాశక్తి జగజ్జనని 9 రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి అమ్మవార్ల చిత్రాలను చిత్రీకరించారు.

News October 10, 2024

నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం

image

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.